బాంది షాపులు తొలగించాలంటూ మహిళలు ధర్నా

Apr 2,2024 21:05

 ప్రజాశక్తి – పాలకొండ : మండలంలోని గోపాలపురంలో ప్రభుత్వ మద్యం షాపును తక్షణమే తొలగించాలంటూ మహిళలు స్థానిక సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. మద్యం షాపు నిర్వహణ ద్వారా అశాంతమైన వాతావరణం నెలకొంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృత్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు.. గ్రామంలో బెల్టు షాపులు మరింత ఇబ్బందుల పాల్జేస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయం మహిళా కానిస్టేబుల్‌కు సమస్యను వివరించారు.

➡️