బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

ప్రజాశక్తి – మద్దిపాడు : మండల పరిధిలోని తెల్లబాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చీకటి ప్రసాద్‌ గత కొంత కాలంగా అనార్యోగంతో బాధపడుతున్నాడు. అందులో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం బియ్యం పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చీకటి ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి కుటుంబ జీవనం కష్టంగా ఉందని పలువురు తమ దష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో వెల్లంపల్లికి చెందిన యాసిన్‌ సహకారంతో 25 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికం సంఘం నాయకులు కొంగాల చిన్న శ్రీనివాసరావు, బూరగ శ్రీనివాసరావు, చీకటి ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️