బ్రౌన్‌శాస్త్రిగా కీర్తిగడించిన జానమద్ది వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సి.పి.బ్రౌన్‌ నడయాడిన ప్రదేశంలో మొండిగోడలుగా ఉన్న బంగ్లాను జ్ఞానసౌధంగా తీర్చిదిద్ది బ్రౌన్‌శాస్త్రిగా కీర్తి గడించిన మహోన్నతవ్యక్తి డాక్టర్‌ జానమద్ది హనుమ చ్ఛాÛస్త్రి అని వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌ అన్నారు. బుధవారం వైవీయూ ఆధ్వ ర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో సి.పి.బ్రౌన్‌ స్మారక గ్రంథాలయ నిర్మాత డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి దశమ వర్ధంతిని, స్మారకోపన్యాసాన్ని నిర్వహించింది. జానమద్ది హనుమ చ్ఛాస్త్రి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ బ్రౌన్‌ గ్రంథాలయం నిర్మాణం వెనుక హనుమచ్ఛాస్త్రి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. భవన నిర్మాణం తోపాటు నిధుల సేకరణ, పుస్తక సేకరణ కోసం అనేక ప్రాంతాలు తిరిగి, అనేకమంది ప్రముఖులను కలసి గ్రంథాలయ అభివద్ధికి పాటుపడ్డారన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించి సాహితీ క్షేత్రంలో గొప్ప రచయితగా హనుమచ్ఛాస్త్రి కీర్తిగాంచారన్నారు. వైవీయూ సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ జానమద్దితో తనకు పరిశోధన చేస్తున్న నాటి నుంచి అనుబంధం ఉందని తెలిపారు. ప్రముఖ అవధానకవి డాక్టర్‌ నరాల రామారెడ్డి ‘అవధాన వైభవం’ అనే అంశంపై ప్రసంగిస్తూ పద్యం తెలుగుభాషకు మాత్రమే దక్కిన వరమన్నారు. కార్యక్రమంలో వైవీయూ తెలుగుశాఖ అధ్యాపకులు ఆచార్య పి.రమాదేవి, ఆచార్య జి.పార్వతి, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకట రమణ, ఎం.మౌనిక, సిబ్బంది, శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థినులు, బాలవికాస్‌ పాఠశాల విద్యార్థులు, గోవిందరెడ్డి, శ్యాంప్రసాద్‌ రెడ్డి, రాజారెడ్డి, కొత్తపల్లె రామాంజనేయులు, జోజిరెడ్డి, అలపర్తి పిచ్చయ్య చౌదరి, పుత్తా పుల్లారెడ్డి పాల్గొన్నారు.

➡️