భట్టిప్రోలులో వైసీపీ ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగించారు. సోమవారం నియోజక వర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని దేవస్థానం నుంచి ప్రారంభించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు పట్టిప్రోలు అద్దేపల్లి గ్రామాల్లో వైసిపి అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు సతీమణి వరికూటి వరలక్ష్మి విడివిడిగా ప్రచారాన్ని చేపట్టారు. వరలక్ష్మి పలువురు వైసిపి మహిళా నాయకులతో కలసి ఇంటింటికీ తిరిగి మహిళలకు తిలకం దిద్ది ఓట్లను అభ్యర్థించారు. అలాగే అశోక్‌ బాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపునకు మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరిస్తూ ఓట్ల అభ్యర్థించారు. వీరి వెంట వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️