భూములకు శాశ్వత హక్కులివ్వడమే లక్ష్యం

Feb 10,2024 21:32

ప్రజాశక్తి- మెంటాడ: పేదల సాగు భూములకు శాశ్వత హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. భూసమస్యల శాశ్వత పరిష్కారం కార్యక్రమంలో భాగంగా 20ఏళ్లుగా సాగుచేస్తున్న నిరుపేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ శనివారం జక్కువ గ్రామంలో ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన హక్కు పత్రాలను పంపిణీ చేశారు. దీనికి ముందు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలూ అందించడం జరుగుతుందన్నారు. 20ఏళ్లుగా సాగులోవున్న నిరుపేదలు 104 మందికి 106 ఎకరాలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. జగన్‌ పాలనలో విద్య, వైద్యం,రోడ్లు, ప్రాజెక్టుల, సిసిరోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలు, ఆధునీ కరణ చేసిన జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టిడిపి నాయకులకు లేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం అందించడంలో జగన్‌ ప్రభుత్వం ముందు ందని, ఈ విషయంలో టిడిపి నాయకులు సాలూరు బోసుబొమ్మ వద్ద గాని, విజయనగరం, పార్వతీపురం పట్టణా లలో ఏ సెంటర్‌ వద్ద నైనా విలేకరుల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. ఈ కార్యక్ర మంలో వైస్‌ ఎంపిపిలు సారిక ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ, నాయకులు లెంక రత్నాకర్‌ నాయుడు, తహశీల్దార్‌ త్రినాధ నాయుడు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు లచ్ఛిరెడ్డి అప్పలనాయుడు, ఎఒ గోకుల కృష్ణ, సర్పంచ్‌ ఎల్‌. సత్యవతి, ఎంపిటిసి కర్రి సంధ్య, మెంటాడ, జక్కువ పిఎసిఎస్‌ల అధ్యక్షు లు తాడ్డి రామచంద్రరావు, రెడ్డి అప్పా రావు, సాలూరు మహి ళా పార్టీ అధ్యక్షులు సిరిపురం నాగమణి, మండల సచివాలయ కన్వీనర్‌ కనిమెరక త్రినాధరావు, నియోజకవర్గ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కాపారపు పైడిపునాయుడు, పార్టీనేతలు కుపిరెడ్డి మోహన్‌, పొడిపిరెడ్డి అప్పలనాయుడు, అరుణ కుమారి, రెడ్డి రాజప్పలనాయుడు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బ ంది తదితరులు పాల్గొన్నారు

➡️