మండలాభివృద్ధికి కృషి : ఉగ్ర

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : సిఎస్‌పురం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చింతపాడులో టిడిపి ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పేదలను ఆదుకునే కృషి చేస్తామని తెలిపారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేసేందుకు కషి చేస్తానని తెలిపారు. వైసిపి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని అలాంటి దుర్మార్గపు పాలనకు అంతం పలకాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు, ట్రిపుల్‌ ఐటి, రైల్వే లైను, ఇంటింటికీ తాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కనిగిరి ప్రాంతం నుంచి వలసలు నివారించేందుకు పరిశ్రమలు ఏర్పాటుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు వెంగయ్య, నాయకులు నాగిశెట్టి చినమాల కొండయ్య, మాజీ ఎంపిపి తోడేటి పెద్దఅల్లూరయ్య, షేక్‌ అబ్దుల్లా, దాసరి మల్లికార్జున, గుంటిమడుగు శ్రీనివాసులు, పసుపులేటి గురుకష్ణ, చాలా సుబ్బయ్య, చావా శేఖర్‌, బత్తుల వెంకటాద్రి, ముప్పాళ్ళ వెంకట నరసరాజు, పాములపాటి నరసయ్య, అంబవరం సర్పంచి కొండూరు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️