మక్కెనకు రూ.40 లక్షలిచ్చాం : ఎమ్మెల్యే

Feb 27,2024 00:15

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
ప్రజాశక్తి – వినుకొండ :
ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు తాను రూ.40 లక్షలిచ్చానని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లా డారు. నియోజకవర్గంలో చేపల సొసైటీ చెరువుల సంపద ను ప్రజల సొమ్మును మక్కెన మల్లికార్జునరావు తింటున్నా రని, వాటిని తొలగించి ఆయా గ్రామాల ఆదాయ వనరుగా అప్పగించినందుకు తనపై కక్షగట్టి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్‌, జంగా కృష్ణమూర్తి, అయోధ్య రామిరెడ్డి సమక్షంలో ఆర్థిక పరమైన లావాదేవీలు చర్చ జరగలేదా? అని న్రపశ్నించారు. శ్రీకృష్ణదేవరాయలు రూ.10 కోట్లు ఇస్తానంటే నీవు బ్యాగు తీసుకెళ్లలేదా? అని నిలదీశారు. వేల్పూరులో రైతు నరేంద్రను చెప్పుతో కొడతానన్న మాట వాస్తవమేనని, బ్రోకర్‌ అని సంబోధించినందుకే అలా చేశానని అన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు వెంకటరామిరెడ్డి, యార్డు చైర్మన్‌ చిన్నబ్బాయి, ఎం.రాజయ్య పాల్గొన్నారు.

➡️