మరో అవకాశం ఇవ్వండి: ఉగ్ర

ప్రజాశక్తి-వెలిగండ్ల: కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన 24 కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపిలోకి కనిగిరి అమరావతి క్యాంపు కార్యాలయంలో ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో చేరారు. వీరిని ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత టిడిపిలోకి రావాలని, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. కనిగిరి అభివృద్ధికి ఐదు ముఖ్యమైన హామీలను చంద్రబాబు దృష్టికి రా కదలిరా కార్యక్రమంలో తీసుకెళ్లగా తప్పక నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. గుడిపాటిపల్లి గ్రామంలో టిడిపిలో చేరిన వారు అన్నపురెడ్డి కొండారెడ్డి, ముక్కు శ్రీనివాసరెడ్డి, రెడ్డెం శ్రీనివాసరెడ్డి, చేతల వెంకటేశ్వర్లుతో పాటు మరో 20 కుటుంబాలు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గోనా ప్రతాప్‌, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, మండల టిడిపి అధికార ప్రతినిధి గంజి రాజశేఖర్‌రెడ్డి, కేసరి రమణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముక్కు వెంకటేశ్వర రెడ్డి, గోనా బర్నబాసు, గుంటక నరసింహారెడ్డి, దేవా, మనీష్‌, బాసు సుబ్బారెడ్డి, చెన్నరాజు, నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️