మరో అవకాశం ఇవ్వండి

Feb 10,2024 21:19

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మరోసారి శాసనసభ్యునిగా ప్రజలె అవకాశమిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. శనివారం నగరంలోని 10, 13 డివిజన్ల్లలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. రాజుల వీధిలోను, కూరాకుల వీధిలోను రహదారులు, కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. దాదాపు 75 శాతం మేర పనులు పూర్తి చేయగలగామన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, జోనల్‌ ఇన్చార్జులు ముద్దాడ మధు, స్థానిక కార్పొరేటర్లు ఇసరపు రేవతి దేవి, నాయన పద్మ, రామకృష్ణ, మహేష్‌ పాల్గొన్నారు.

➡️