మహనీయుడు వెంకటస్వామి

ప్రజాశక్తి-పొదిలి: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తాను ఆచరించడమే కాదు తాను నమ్మిన పార్టీకి వారసత్వాన్ని అందించిన ఘనత వెంకటస్వామికి దక్కుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, సిపిఎం రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. సోమవారం మర్రిపూడి మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి సంతాప సభ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంకటస్వామి గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలను ఐక్యం చేయడంలో ముందుండేవారన్నారు. వెనుకబడిన ప్రాంతంలో జన్మించినా విద్య ప్రాధాన్యతను గుర్తించిన వెంకటస్వామి కుమారుడు శ్రీనివాసరావును ఉన్నత విద్యాభ్యాసం చేయిం చేందుకు కావలి జవహర్‌ భారతిలో చేర్పించారన్నారు. పార్టీ విభజన అనంతరం విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరావు అంచెలం చెలుగా కేంద్ర కమిటీ సభ్యులుగా, నేడు రాష్ట్ర కార్యదర్శిగా ఎదుగుదలలో తన తండ్రి వెంకటస్వామి కృషి, శ్రమతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, అక్కచెల్లెళ్ల ప్రోత్సాహం చాలా గొప్పదన్నారు. వృద్ధాప్యంలో వెంకటస్వామికి మనుమ రాలు ఆశాభారతి, ప్రసాద్‌, మునిమనుమరాలు నక్షత చేసిన సేవలు కమ్యూనిస్టుల నిబద్ధతకు నిదర్శనమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అప్పట్లోనే భక్తి వ్యక్తిగతమని, రాజకీయం ప్రజాసేవ అని స్పష్టంగా విభజన గీత గీసిన వెంకటస్వామి నేటితరానికి ఆదర్శమన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు పోతినేని సుదర్శన్‌, సిఐటియు రాష్ట్ర నాయకురాలు పి రోజా, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర జాయింట్‌ కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, పొదిలి మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ యర్రమోతు శ్రీనివాసులు, సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు వై సిద్దయ్య, మర్రిపూడి మండల టిడిపి నాయకులు రేగుల వీర నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ప్రజాశక్తి ఎడిటర్‌ బి తులసీదాసు, సిఐటియు రాష్ట్ర నాయకురాలు కే సుబ్బారావమ్మ, సిపిఎం ఎన్టీఆర్‌, బాపట్ల జిల్లా కార్యదర్శులు డివి కృష్ణ, సిహెచ్‌ గంగయ్య, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లా నాయకులు పి అజరు కుమార్‌, జి వెంకటేశ్వర్లు, జి చలమయ్య, ఎన్‌ భావన్నారాయణ, సిపిఎం తెలంగాణ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, ఆర్‌ వెంకట్రాములు, ఎం శోభన్‌ నాయక్‌, కె రమేష్‌ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, ఎస్‌కె మాబు, ఉసా వెంకటేశ్వర్లు, డి సోమయ్య, వి ఆంజనేయులు, ఐద్వా పల్నాడు జిల్లా నాయకురాలు జి ఉమాశ్రీ, ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కే రమాదేవి, సిపిఎం నాయకులు జి రమేష్‌, బి సుబ్బారావు, కె సుబ్బారావు, బి రఘురామ్‌, ప్రజాశక్తి ఎడిషన్‌ మేనేజర్‌ ఎంఎల్‌వి ప్రసాదరావు, బ్యూరో ఎస్‌వి బ్రహ్మం, పొదిలి పెద్దచెరువు సాగర్‌ నీటి స్ఫూర్తి ప్రదాత మాకినేని వెంకట రమణయ్య, సీనియర్‌ జర్నలిస్టు శ్రీరామ కోటేశ్వరరావు, సిహెచ్‌ కృష్ణారావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు కావూరి రఘుచంద్‌, పోస్టల్‌ శాఖ నాయకులు జి శ్రీనివాసమూర్తి, వెంకటస్వామి కుటుంబ సభ్యులు వి ఆశాభారతి, బి ప్రసాదు, నక్షత, గ్రామ మాజీ సర్పంచ్‌ వంకాయలపాటి వెంకయ్య, సిపిఎం పొదిలి ప్రాంత నాయకులు ఎన్‌ వెంకటేశ్వరరెడ్డి, పి బాలనర్సయ్య, ఎ శ్రీనివాసులు, ఎంబాదుల్లా, జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నాన్నకు గుర్తుగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి వెంకటస్వామి ఎంతో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన నడిచిన కమ్యూనిస్టు ఉద్యమ బాటలో తాము నడిచేలా తీర్చిదిద్దిన స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలో ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

➡️