మాయమాటలు నమ్మొద్దు : మంత్రి

ప్రజాశక్తి- శింగరాయకొండ : మూడు పార్టీల కూటమి నాయకులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దనిరాష్ట్ర మున్సిపల్‌ పట్టణణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శింగరాయకొండలోని గంజి వారి కల్యాణ మండపంలో కొండపి నియోజకవర్గ స్థాయి యాదవ ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవ సంఘం జాతీయ నాయకుడు బోట్ల రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ బీసీలకు వైసిపి ఎంతో అండగా ఉందన్నారు. ప్రత్యేకంగా యాదవులకు రాజ్యసభ పార్లమెంట్‌, శాసనసభ శాసనమండలి లాంటి పదవులతో పాటు మార్కెట్‌ కమిటీ, మున్సిపల్‌ చైర్మన్‌, జిల్లా పరిషత్‌, ఎంపిపి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మాయమాటలు చెప్పే కూటమి మూడు పార్టీలతో ముందుకొచ్చినట్లు తెలిపారు. కూటమి కులాల వారీగా చిచ్చులు పెడుడుతుందన్నారు. కూటమి కక్షతో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నట్లు తెలిపారు. కొండేపి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఇన్ఫో స్ట్రక్చర్స్‌ రాష్ట్ర చైర్మన్‌ యనమల నాగార్జున యాదవ్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి యాదవులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్‌ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌. పిచ్చయ్య యాదవ్‌, యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, పామర్తి మాధవరావు, మసనం వెంకట్రావు, కొండపి వైస్‌ ఎంపిపి రావులపల్లి రాజు, డాక్టర్‌ యన్నబత్తిన కార్తీక్‌ , తాండ్ర రామ్మూర్తి, టంగుటరు ఎంపిపి పటాపంజుల కోటేశ్వరమ్మ , బొట్ల సుబ్బారావు గాలి బుజ్జి, మాదాల శంకర్‌, పెరుగు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️