మేకపాటిని కలిసిన లీగల్‌సెల్‌ నాయకులు

Apr 1,2024 21:30
ఫొటో : ఎంఎల్‌ఎ మేకపాటిని కలిసిన లీగల్‌సెల్‌ నాయకులు

ఫొటో : ఎంఎల్‌ఎ మేకపాటిని కలిసిన లీగల్‌సెల్‌ నాయకులు
మేకపాటిని కలిసిన లీగల్‌సెల్‌ నాయకులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌సెల్‌ నాయకులు సోమవారం ఆత్మకూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైసిపికి అవసరమైన సేవలు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన పాలనలో జూనియర్‌ న్యాయవాదులను సైతం ఆదుకునేలా వైఎస్‌ఆర్‌లా నేస్తం ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించారని, రానున్న ఎన్నికల్లో పార్టీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామన్నారు. అంతకు ముందు ఎంఎల్‌ఎ మేకపాటి పట్టణంలోని పలు వార్డుల్లో పలువురు సీనియర్‌ నాయకులను, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఆదిశేషయ్య, ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, న్యాయవాదులు టి.తిరుపతమ్మ, నజీరు, వెంకటరమణమ్మ, మల్లికార్జున, నరసింహులు, బాబు, కిరణ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

➡️