మైనార్టీల సంక్షేమమే లక్ష్యం

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలోని మైనార్టీలందరికీ అందుబాటులో ఉండి వారికి సంక్షేమం అందించడమే తమ లక్ష్యమని జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి షేక్‌. ఇమ్రాన్‌ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్య, సంక్షేమ పథకాలను ఎలా అందించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.మైనార్టీ వెల్ఫేర్‌ స్కీమ్‌ వివరాలు తెలపండి? రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవన అందిస్తున్నాం. మైనార్టీలకు వ్యక్తిగత రుణాలను కూడా మంజూరు చేస్తున్నాం. పౌర సరఫరా శాఖ అందిస్తున్న నిత్యావసర సరుకులు లబ్ధిదారులు అందించడానికి ప్రత్యేక వాహనలను 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నాం. వీటి ఖరీదు రూ.5.80 లక్షలు అవుతుంది. దీని వల్ల మైనార్టీలకు కుటుంబాలను పోషించుకునే అవకాశం కలుగుతుంది. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసు కలిగిన మహిళలకు రుణాలను అందిస్తున్నాం. ప్రతి సంవత్సరమూ రూ. 18 వేల రూపాయలు అందజేస్తున్నాం.మైనార్టీల విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? జిల్లాలోని రాజంపేట మండలలో ఇంటర్‌, ఆపై తరగతులు చదువుతున్న పేద మైనారిటీ విద్యార్థుల కోసం పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ బాలుర, బాలికలకు భోజన వసతి ప్రభుత్వ ఆదేశాల మేరకు కాస్మోటిక్‌ చార్జీలను అందజేస్తున్నాం.కేంద్రం ప్రభుత్వం ఎలాంటి స్కీములు మంజూరు చేస్తుంది? నేషనల్‌ స్కాలర్షిప్‌ ప్రోగ్రాం (ఎన్‌ఎస్‌పి) ద్వారా 9,10 తరగతి చదువుతున్న పేద మైనార్టీ విద్యార్థులకు ప్రిమె మెట్రిక్‌ స్కాలర్షిప్‌ ద్వారా రూ. 1000 ఖాతాకు జమ చేస్తున్నాం. నేషనల్‌ ఇంటర్‌ ఆపై చదువుతున్న పేద మైనార్టీల విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్షిప్‌ ద్వారా రూ. 5 వేలు ఖాతాకు జమ చేస్తున్నాం. ట మెరిట్‌ కం మీన్స్‌ స్కీంలో ప్రొఫెషనల్‌ కోర్స్‌ చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్స్‌ స్కాలర్షిప్‌ ద్వారా రూ.20 వేల రూపాయలు ఖాతాకు జమ చేస్తున్నాం. బేగం హజరత్‌ మహాల్‌ నేషనల్‌ స్కాలర్షిప్‌ ప్రోగ్రామ్‌ కింద పేద విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 6వేలు ఖాతాకు జమ చేస్తున్నాం.సిబ్బంది కొరత ఏమైనా ఉందా?ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలను పర్యవేక్షిస్తున్నాం.అన్నమయ్య జిల్లా నూతనంగా ఏర్పాటయింది. దీని కారణంగా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న సిబ్బంది తోనే విధులను నిర్వహిస్తున్నాం.మైనార్టీలకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివద్ధి చెందాలి. మైనార్టీలందరూ తమ పిల్లలను చదువుకునే విధంగా ప్రయత్నం చేయాలి. విద్యతోనే మైనార్టీలకు భవిష్యత్తు ఉంటుంది.

➡️