మౌలిక వసతుల కల్పనకు కృషి: కోన

ప్రజాశక్తి-బాపట్ల: నల్లమడ డ్రెయిన్‌ పరివాహక ప్రాంత గ్రామాలైన తూర్పు, పశ్చిమ పిన్నిబోయినవారిపాలెం గ్రామాలతో పాటు కప్పలవారిపాలెం గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. మంగళవారం బాపట్ల మండలం తూర్పు పడమర పిన్నిబోయినవారిపాలెం, కప్పలవారిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్లమడ వాగుకు అత్యంత సమీపంలో ఆనుకొని ఉన్న గ్రామాలను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన ద్వారా అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. ప్రచార కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు, ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️