యడ్లపాడులో జెవివి చెకుముకి సైన్స్‌ సంబరాలు

Feb 11,2024 00:44

ఇస్రో ప్రదర్శన వద్ద విద్యార్థులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
జనవిజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యంలో మండల కేంద్రమూన యడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో చెకుముకి సైన్సు సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రా వ్యాప్తంగా 26 జిల్లాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఆవిష్కరించగా జనవిజ్ఞాన వేదిక జెండాను పల్నాడు జిల్లా అధ్యక్షులు డి.బుజ్జిబాబు ఆవిష్కరించారు. అనంతరం నారాయణ హైస్కూల్‌ (యడ్లపాడు), మోడర్న్‌ హైస్కూల్‌ (చిలకలూరిపేట) విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఇస్రో సైంటిస్టులతో మీట్‌ ది సైంటిస్ట్‌, ఇంటరాక్షన్‌ విత్‌ పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇస్రో – శ్రీహరికోట నుండి వచ్చిన స్పెషల్‌ వెహికిల్‌ ఎగ్జిబిషన్‌లో వివిధ రాకెట్ల మోడల్స్‌, అంతరిక్ష అంశాలపై ఫొటోలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఎవివి ఎస్‌.స్వామి, సీనియర్‌ సైంటిస్ట్‌ (రిటైర్డ్‌) పి.జగదీష్‌ చంద్రరెడ్డి, ప్రొఫెసర్‌ మాల కొండయ్య, ఇస్రో సైంటిస్ట్‌ బి.శ్రీనివాసరావు, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామారావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్‌. ఎస్‌.ప్రసాదు, జెవివి రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్‌, ఎస్‌.ఎన్‌.రమేశ్‌, కెఎంఎంఆర్‌ ప్రసాద్‌, సిహెచ్‌.జయప్రకాష్‌, వైఎస్‌. నాగేశ్వర్‌, గోపాల్‌రావు, టి.సురేష్‌, స్కూల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, సృజన, కాళిదాసు పాల్గొన్నారు.

➡️