‘యువత ఓటు నమోదు చేసుకోవాలి’

ప్రజాశక్తి – రాయచోటి నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి యువత ఓటు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని టిడిపి పట్టణ అధ్య క్షులు, ఎపి వారియర్స్‌ నియోజక వర్గ టీమ్‌ కార్యవర్గ సభ్యులు బోనమాల ఖాదరవల్లి, జి.నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, రాయచోటి నియో జకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి సూచనల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్క విద్యార్థి, యువత అందరూ ఓట్లు నమోదు చేసుకో వాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి 45 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యా ర్థులు, యువత, రాష్ట్రంలో ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుంటే ఈ నెల 15 లోపు చేసుకోవాలని తెలియజేసారు. ఇప్పుడు ఉన్న ప్రతి కొత్త ఓటరు మన రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థుల నుంచి బయటపడటానికి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమించే వ్యక్తి అని అన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా గెలిచాక 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పనకు సిద్ధం చేశారని అన్నా రు. అలాగే యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు ఇవ్వడానికి నారా లోకేష్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి ఎన్నో అభివద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరు సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, గుర్రం సుబ్బయ్య, కొట్టే చలపతి, ఇలి యాస్‌ అమీర్జాన్‌, వెంకటరామిరెడ్డి, ఏపీ వారియర్స్‌ టీమ్‌ పాల్గొన్నారు.

➡️