రాజాదేశవ్యాప్త బంద్‌ జయప్రదానికి పిలుపు

Feb 10,2024 21:33
ఫొటో : మాట్లాడుతున జిల్లా ఆటో యూనియన్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన

ఫొటో : మాట్లాడుతున జిల్లా ఆటో యూనియన్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన
రాజాదేశవ్యాప్త బంద్‌ జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఫబ్రవరి 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా ఆటో యూనియన్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా పిలుపిచ్చారు. మండలంలోని మైపాడు బీచ్‌ వద్ద నిర్వహించిన ఆటో డ్రైవర్ల జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 106 (1)106(2) తక్షణం రద్దు చేయాలని కోరుతూ 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టంలోని ప్రమాదకర సెక్షన్‌ కారణంగా డ్రైవర్లు అశాంతికి ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ చట్టం కారణంగా డ్రైవర్లు జైల్లో ఉండాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టాన్ని అమలు చేయడంపై ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. దాని కారణంగా రవాణా రంగం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో స్టాండ్‌ అధ్యక్ష కార్యదర్శులు బర్రె ప్రసాద్‌, అశోక్‌, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️