రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి: విజరుకుమార్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజరుకుమార్‌ ఓటర్లను కోరారు. మండలంలోని పేర్నమిట్ట 39వ డివిజన్‌ మర్రిచెట్లకాలనీలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమంలో విజరుకుమార్‌ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ మ్యానిఫెస్టోలోని పథకాల గురించి వివరిస్తూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడకా స్వాములు, నాయకులు ఆరికట్ల సుమతి, నల్లూరి ప్రవీణ్‌, పెంట్యాల శ్రీనివాసరావు, లత, పద్మ, బోడపాటి రాంబాబు, సుధారాణి, షేక్‌ అమానుల్లా, నరేన్‌, పాతూరి నాగేశ్వరావు, కరణం నారాయణ, మాధవి, చౌదరి, మలగా వెంకట్రావు, నాటకం శంకర్‌, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️