రాష్ట్రం 40ఏళ్లు వెనక్కి

Feb 9,2024 19:49

ప్రజాశక్తి- విజయనగరం కోట :  వైసిపిపాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె గాజులరేగలో పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వైసిపికి ఒక్క ఛాన్స్‌ అని అవకాశం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి నెట్టి అంధకారంలోకి తీసుకువెళ్లిన జగన్‌ పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్తె, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు , కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, స్థానిక నాయకులు ఆల్తి వరలక్ష్మి, టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️