రూ. 84,850 పురుగు మందులు స్వాధీనం

Feb 13,2024 00:23

ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ : పెదకాకాని మండలం వెనిగండ్లలో శ్రీమహాలక్ష్మి ఎంటర్‌ ప్రైజెస్‌లో అనుమతులు లేకుండా పురుగుమందులు విక్రయిస్తుండగా విజిలెన్సు అధికారులుదాడి చేసి రూ. 84,850 విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ నుండి అనుమతులేమీ లేకుండా కొంత మంది డీలర్ల నుండి యూనిరాన్‌ అను పురుగు మందును కొనుగోలు చేసి విక్రయిస్తుండగా తనిఖీ చేసి ఈ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 21 లీటర్ల యూనిరాన్‌ అను పురుగు మందును స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్సు అధికారులు తెలిపారు. పురుగు మందు నమూనాలను నాణ్యతా ప్రమాణాలను పరీక్షించుటకు పురుగుమందుల ప్రయోగశాలకు పంపారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ కె.రమణకుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రామచంద్రయ్య, స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి పి.సంధ్యారాణి పాల్గొన్నారు.

➡️