రెండు హద్దు అంతకంటే వద్దు : డిఎంహెచ్‌ఒ

Feb 10,2024 21:43

ప్రజాశక్తి -వీరఘట్టం: ఒకటి ముద్దు… రెండు హద్దు… అంతకంటే ఎక్కువ వద్దు అంటూ గర్భిణులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బగాది జగన్నాథరావు సూచించారు. శనివారం స్థానిక పిహెచ్‌సిలో పిఎంఎస్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. అధికంగా కాన్పు వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఒకటీ లేదా రెండు కాన్పులతో సంతానం ఆపివేయాలని గర్భిణులకు సూచించారు. నెలలు నిండిన కొద్దీ వైద్య అధికారుల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. రక్తహీనత తక్కువగా ఉంటే ఐరన్‌ సిప్రోజన్‌ అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగిం చుకోవాలని అన్నారు. ముఖ్యంగా హైరిష్కు కేసులను గుర్తించి ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలని వైద్యాధికారి పి.ఉమామహే శ్వరిని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అలాగే మందుల స్టోర్‌ రూమును, ల్యాబ్‌ను పరిశీలించారు. ఆర్‌బిఎస్‌కె దవళ భాస్కరరావు సిబ్బంది, ఉన్నారు.

➡️