రెవెన్యూ అధికారులను సన్మానించిన జెసి

Feb 29,2024 21:55

రెవెన్యూ అధికారులను సన్మానించిన జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

రెవెన్యూ శాఖలో 42 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి కలెక్టరేట్‌ ఎల్‌ఎ విభాగం పర్యవేక్షకులుగా ఉండి పదవీ విరమణ పొందుతున్న పి. వెంకట్రాయులు, 40 సంవత్సరాలు పనిచేసి ఎన్నికల విభాగం పర్యవేక్షకులుగా ఉండి పదవీ విరమణ పొందుతున్న ఎ.ప్రసాద్‌ బాబు, రెవెన్యూ శాఖకు విశేషసేవలు అందించారని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు కొనియాడారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఏపి రెవెన్యూ అసోసియేషన్‌ కలెక్టరేట్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎల్‌ఎ విభాగం పర్యవేక్షకులు పి.వెంకట్రాయులు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎ.ప్రసాద్‌బాబు పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో క్రమశిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వర్తించిన వీరి జీవితం పదవీ విరమణ అనంతరం సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. డిఆర్‌ఓ బి.పుల్లయ్య మాట్లాడుతూ రెవెన్యూశాఖలో వీరు ఇద్దరూ విధులు నిర్వర్తించడంలో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. డ్వామా పిడి ఎన్‌.రాజశేఖర్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో పుంగనూరు తహశీల్దార్‌గా పనిచేసిన పి.వెంకట్రాయులు అధికారుల ఆదేశాలను తప్పక పాటించారని, కరోనా బాధితులకు సహాయం అందించారని వీరి సేవలను అభినందించారు. సన్మాన గ్రహీతలు పి.వెంకట్రాయులు, ఎ.ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం పని చేయడంలో అధికారులు అందించిన సహకారం మరవలేదనాన్నరు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ శివయ్య, కలెక్టరేట్‌ ఏఓ కులశేఖర్‌, కలెక్టరేట్‌ వివిధ విభాగాల పర్యవేక్షకులు, ఏపి రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా సెక్రెటరీ హుసేన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌కే.ఇబ్రహీం, కలెక్టరేట్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ పార్థసారధి, సెక్రెటరీ రాజు, ట్రేజరర్‌ మధు బాబు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️