రైతుబజార్‌, సంత నిర్వహణకు తీర్మానం

Feb 12,2024 21:29

ప్రజాశక్తి-బొబ్బిలి : మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌, ప్రతి బుధవారం వారపు సంత నిర్వహించేందుకు ఎఎంసి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎఎంసి కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. బొబ్బిలిలో రైతు బజారుకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరిన స్థలం కేటాయించలేదని, మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌ నిర్వహణకు తీర్మానించారు. బొబ్బిలిలో ప్రతి బుధవారం జరిగే వారపు సంత కరోనా లాక్‌డౌన్‌ నుంచి నిలిచిపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మార్కెట్‌ యార్డులో సంత నిర్వహణకు తీర్మానించారు. తెర్లాంలో రెండు, డొంకినవలసలో ఒకటి, బొబ్బిలిలో ఒకటి చొప్పున గోదాముల నిర్మాణానికి రూ.2.40కోట్లతో ప్రతిపాదనలు చేశామని చైర్మన్‌ తెలిపారు. పాత గోదాములను బాగు చేసేందుకు రూ.కోటితో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఎఎంసి ఆదాయం బ్యాంకులో రూ.8.80 కోట్లు ఉందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి రూ.2 కోట్లు సెస్‌ రావాల్సి ఉందన్నారు. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ తెంటు పార్వతి, సెక్రటరీ కె.ఈశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

➡️