రైల్వే అభివృద్ధి పనులు పరిశీలన

Feb 13,2024 21:22

ప్రజాశక్తి – కొత్తవలస : రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమృత్‌ భారత్‌లో కొత్తవలస రైల్వేస్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి పనులను విశాఖ డిఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ మంగళ వారం ఆకస్మికంగా పరిశీలించారు. రూ.22 కోట్లతో చేపట్టిన ఈ పనులు నాణ్యత ప్రమాణంగా ఉండాలని, సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌ అభివృద్ధి, ఫ్లాట్‌ఫారమ్‌లో ప్రయాణికులకు వివిధ రకాల సౌకర్యాలను కల్పించే విధంగా పనులుండాలన్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్‌కు రెండవ ముఖద్వారం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ స్టేషన్‌లో రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలతోపాటు అవసరమైన పలు రైళ్లను నిలుపుదల చేసే ప్రక్రియ ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పనులు నెలాఖరు లోగా పూర్తిచేసి వచ్ఛే నెలలో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట స్టేషన్‌ మేనేజర్‌ రాజు తదితరులు ఉన్నారు.

➡️