లోకేష్‌ సభా వేదిక స్థల పరిశీలన

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటన యర్రగొండపాలెంలో ఈ నెల చివరిలో ఖరారైన నేపథ్యంలో సభా వేదికకు కావాల్సిన స్థలాన్ని శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు టిడిపి నాయకులతో వెళ్లి పరిశీలించారు. మాచర్ల-మార్కాపురం 565 జాతీయ రహదారి పక్కన ఉన్న అప్పారావు తోటలోని ఐదు ఎకరాల స్థలాన్ని యుద్ద ప్రాతిపదికన శుభ్రం చేయించారు. అక్కడ ఏర్పాటు చేయాల్సిన బారికేడ్లు, స్టేజీ, సభా ప్రాంగణం ఏర్పాటు తదితర పనులు వేగవంతంగా చేయాలని కోరారు. లోకేష్‌ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, షేక్‌ వలి, కాకర్ల కోటయ్య, తోటా మహేష్‌ నాయుడు, కె భాస్కర్‌తో పాటు లోకేష్‌ పర్యటన టీం సభ్యులు పాల్గొన్నారు.

➡️