వరికపూడిశెల పనులు చేయకుంటే ఎన్నికల్లో 100 నామినేషన్లు

Feb 13,2024 00:28

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు
ప్రజాశక్తి – వినుకొండ :
వరికపూడిశెల ప్రాజెక్టుకు తక్షణమే రూ.1600 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో సోమవారం విలేకర్లతో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు విలేకర్లతో మాట్లాడారు. గతేడాది నవంబర్‌ 15న ప్రాజెక్టుకు సిఎం శంకుస్థాపన చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఒక ఇటుక బిళ్ల కూడా వేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా నిధులు కేటాయించడం లేదని, ఇది పల్నాడు ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. రైతుసంఘం నాయకులు యు.రాము, వరికపూడిశెల జలసాధన సమితి నాయకులు రామాంజినాయక్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరికపూడిశెల పల్నాడు ప్రజల కలని, ఎన్నికల్లో ఓట్ల కోసం అధికార పార్టీ ఆడుతున్న నాటకాలను, బూటకపు శంకుస్థాపనలను ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ప్రభుత్వం ఇదేవిధంగా ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో వరికపుడిశల జలసాధన సమితి పేరుతో మాచర్ల నుండి 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.

➡️