వరి పైరు పరిశీలన

Feb 10,2024 19:27
వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి

వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి
వరి పైరు పరిశీలన
ప్రజాశక్తి – లింగసముద్రం : ఈ క్రాప్‌ చేయించుకోని రైతులు ఇంకా ఉంటే వెంటనే చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి అబ్రహాంలింకన్‌ చెప్పారు. శనివారం ఆయన మండలంలోని మొగిలిచర్లలో వరి పైరును పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన వరికోత దశలో రైతులు జాగ్రతలు తీసుకోవాలని, రైతులకు పలు సూచనలు, సలహలు ఇచ్చారు. ప్రస్తుతం మండలంలో 225 ఎకరాలు శనగ, 213 ఎకరాలు మినుము, 2042 ఎకరాలు పొగాకు,462 ఎకరాలు మిరప,629 ఎకరాలు వరి ఈ క్రాప్‌ చేసినట్లు తెలిపారు.మండలంలో అన్ని గ్రామల్లో 3791 ఈ క్రాప్‌ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారు కూడా వెంటనే చేయుం చుకోవాలని చెప్పారు.ప్రతి రైతు ఈకెవైసి చేయిం చుకోవాలన్నారు. మొగిలిచర్ల గ్రామ వ్యవసాయ సహా యకురాలు టి.దీప,గ్రామ రైతులు ఉన్నారు.

➡️