వర్క్‌షాప్‌ ప్రారంభం

ప్రజాశక్తి-వేటపాలెం: బిటెక్‌ విద్యార్థులకు ఎథికల్‌ హాకింగ్‌పై రెండు రోజుల వర్క్‌ షాపు ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్‌ ఎస్‌ లక్ష్మణరావు సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని సైబర్‌ సెక్యురిటీ విభాగ విద్యార్థులకు ఎథికల్‌ హాకింగ్‌పై రెండు రోజుల వర్క్‌షాపును ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కె జగదీష్‌ బాబు తెలిపారు. డి సాయి సతీశ్‌, ప్రెసిడెంట్‌, ఎమర్స్‌ సొసైటీ, ఈ వర్క్‌షాపును నిర్వహిస్తున్నట్లు సైబర్‌ సెక్యురిటీ విభాగాధిపతి ఎం రమేష్‌ తెలిపారు. ఈ వర్క్‌షాపులో విద్యార్థులకు ఎథికల్‌ హ్యాకింగ్‌పై అవగాహన కల్పించి, ఎథికల్‌ హాకింగ్‌ సంబంధించిన వివరాలు, పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపులో సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొంటున్నారు.

➡️