వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయాలి- సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-కాశినాయన మండలంలోని అక్కేమ్‌గుండ్ల సావిశెట్టిపల్లె పొలాలలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి దాదాపు 7 బోర్లు వేసిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో సర్వే నంబర్‌ 144/2లో 2-90, 144/3లో 4- 16, 45. 146 సర్వే నెంబర్లలో 15 సంవత్సరాల నుంచి పేదలు సాగు చేసుకుంటుంటే అలాంటి భూమిలో దౌర్జన్యంగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఏడు మోర్లు వేసిన విషయంపై శుక్రవారం ఆయన విచారణ చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఆర్‌ఐ దక్షిణామూర్తితో అక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా దౌర్జన్యంగా బోర్లు వేసిన శ్రీనివాసరెడ్డిపై వెంటనే కేసు నమోదు కోసం పోలీసులకు సిఫారసు చేయాలని కోరారు . దాదాపు ఈ ప్రాంతంలో 250 ఎకరాలు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండటం రెవెన్యూ అధికారులకు ఇది ఎంతవరకు న్యాయంగా కనిపించిందో వారే ఆలోచించుకోవాలన్నారు. 2018 సంవత్సరంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన భూ పోరాటానికి ఫలితంగా అప్పటి కలెక్టర్‌ ఆరుగురు తహశీల్దార్లతో విచారణ చేపట్టారు ఆ సందర్భంలో శ్రీనివాసులు రెడ్డి భూమి అంతా బోగస్‌ అని నిర్ధారణ కారండంతో కొన్ని సర్వే నెంబర్లను ఆన్‌లైన్‌లో తొలగించారని చెప్పారు. ఆ ఫైలు బయటకు తీస్తే జిల్లా అధికారులు వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. పోలీసులతో మండల స్థాయి రెవెన్యూ అధికారులతో శ్రీనివాసరెడ్డి కుమ్మక్కయి పేద దళితుల పైన కూడా కేసులు బనాయించడానికి పోలీసులు సిద్ధపడ్డారన్నారు. భూ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే బసనపల్లి గ్రామానికి చెందిన శ్రీను కూడా దాదాపు వందల ఎకరాల్లో భూకబ్జా చేశారన్నారు. వారం రోజుల కిందట తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. భూ కబ్జాదారుని ఆధీనంలో ఉన్న భూ సర్వే నెంబర్ల అందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి బినామీ పట్టాల రద్దుచేసి పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య నారాయణ పోలయ్య గురవయ్య బాబు కొంతమంది పేద బాధితులు పాల్గొన్నారు

➡️