వాసిచీకట్లో గురజాడ అప్పారావు నగర్‌

Mar 31,2024 20:59

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ : జిల్లా కేంద్రం, జిల్లాను పరిపాలించే జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి, కలెక్టర్‌ ఇంటికి కిలో మీటర్‌ దూరంలో ఉంది గురజాడ అప్పారావు నగర్‌. ఇక్కడ సుమారుగా 50 కుటుంబాలు నివాసం ఉన్నాయి. ఇల్లు కట్టుకొని సుమారుగా 15 ఏళ్లు దాటినా నేటికీ విద్యుత్‌ సౌకర్యం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చును. కొండలు మీద ఉన్న గిరిజన ప్రాంతాలకు సైతం విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వాలు, పాలకులు జిల్లా కేంద్రంలో 15 ఏళ్లకు పై బడి విద్యుత్‌ లేకుండా చీకట్లోనే బతుకులు ఈడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం. కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కొంత కేటాయించి మూడు ఇళ్ళ వారు సోలార్‌ విద్యుత్‌ వాడుకుంటున్నారు. మిగిలిన కుటుంబాలు వారు దీపం బుడ్డీలే ఆధారంగా జీవిస్తున్నారు. రోజు తెచ్చుకున్న కూలీ డబ్బులు తిండికే సరిపోతుండటంతో సోలార్‌ పెట్టుకునే అవకాశం లేక చాలా మంది కారు చీకట్లోనే జీవనం వెల్లదీస్తున్నారు. నగర్‌ ఏర్పడి 15 ఏళ్లు దాటినా నేటికీ విద్యుత్‌ లేదు. రోడ్లు లేవు. కాలువలు లేవు. మరుగుదొడ్లు సౌకర్యం లేదు. ఎటువంటి కనీస సౌకర్యాలూ లేక అనేక ఇబ్బందులు, అసౌకర్యాలు మద్య జీవనం సాగిస్తున్నారు. అక్కడున్న వాళ్ళు అందరూ పేదలు కావడంతో కనీసం వారి సమస్యలు వినే వారు, చూసే వారు కూడా లేకపోవడం దారుణం. సిపిఎం ఆధ్వర్యంలో అనేక మార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గురజాడ అప్పారావు నగర్‌ వాసులు సమస్యలు విన్నవించుకున్నా వారి గోడు పట్టించుకునే నాధుడే లేకపోయాడు. పిల్లలు చదువుకునేందుకు కలెక్టరేట్‌ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బడులకు కాలినడకన వెళ్లి రావాల్సిందే తప్ప వాహన సదుపాయం లేదు. స్కూల్‌ కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లి తండ్రులు భయంతో ప్రతి రోజూ ఎదురు చూడాల్సిందే. కొనుక్కుంటేనే తాగునీరుఈ నగర్‌లో కనీసం తాగునీటిని కూడా ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు దగ్గర వాటర్‌ టాంకర్‌ నీరు కొనుక్కొని వాడుకుంటున్నారు. టాంకర్‌ నీటికి రూ.750లు వసూలు చేస్తున్నారు. టాంక్‌ నీరు వీధిలో ఉన్న వారు ఇంటికి ఇన్ని బిందెలు అని చెప్పి వాటిని వాడుకోవాల్సిందే. టాంకర్‌తో కొనుగోలు చేసిన నీటిని వీధిలో ప్లాస్టిక్‌ డబ్బాల్లో నిల్వచేసుకుని వినియోగించుకుంటున్నారు. గతంలో బోరు ఏర్పాటు చేసుకున్నా..గతంలో నగర్‌ వాసులంతా డబ్బులు ఎత్తుకొని బోరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ బోరు ద్వారా తాగునీరు రాలేదు. దీంతో వాడుకలకు, తాగడానికి టాంకర్‌ నీరే నగర్‌ వాసులకు గతి అయింది.కాలకృత్యాలకు కొండే గతిమరో వైపు గురజాడ అప్పారావు నగర్‌ వాసులకు మరుగుదొడ్లు సౌకర్యం లేదు. దీంతో నగరాన్ని ఆనుకొని ఉన్న కొండ వెనుక వైపు కాలకృత్యాలు తీర్చుకావాల్సిందే. మహిళలు ఇద్దరు ముగ్గురు తోడుగా వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని రావాల్సిందే. ఒంటరిగా వెళ్లలేని పరిస్థితిలో నగర్‌ వాసులు జీవిస్తున్నారు.చీకటి నుంచి కాపాడండిపదిహేనేళ్లుగా చీకటిలోనే జీవిస్తున్నాం. విద్యుత్‌ సౌకర్యం కల్పించి వెలుగు నివ్వండి. ఎన్నిసార్లు అధికారులు, పాలకులకు విన్నవించినా ఎటువంటి ఉపయోగం లేదు. మాకు విద్యుత్‌, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించి రక్షణ కల్పించాలి.డి.కరుణ, నగర్‌ వాసిమౌలిక సదుపాయాలు కల్పించాలిగత 15 ఏళ్లుగా ఇక్కడ ఎటువంటి సౌకర్యాలూ లేకుండా జీవిస్తున్నాం. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు, రోడ్లు, కాలువలు, విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. మేము మనుషలం అనే విషయాన్ని అధికారులు, పాలకులు గుర్తించాలి. తాగేందుకు నీరు లేని స్థితిలో ఉన్నామంటే మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. రంబ శ్రీనివాసరావు, నగర్‌

➡️