విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ప్రభుత్వంచే గుర్తింపు పొందాలని దర్శి నియోజకవర్గం ఉద్యోగ సంఘం నాయకులు, ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు అన్నారు. స్థానిక అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తూర్పు వీరాయపాలెం పాఠశాల ఉపాధ్యాయుడు ఇట్లా వెంకటేశ్వర్లు తల్లి ఇట్లా పిచ్చమ్మ జ్ఞాపకార్థం 70మంది పదో తరగతి విద్యార్థులకు అట్టలు, పెన్నులు, స్కేళ్లు, పెన్నిళ్లు పంపిణీ చేశారు. అదే విధంగా దర్శికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డాక్టర్‌ మునగా నరసింహారావు సహకారంతో రూ.10 వేల విలువ చేసే మెడికల్‌ కిట్‌ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల మాస్టర్‌ కే వినరు అధ్యక్షత వహించగా సంఘ నాయకులు లక్ష్మణ్‌, నాయక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️