విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచాలి

ప్రజాశక్తి-చీమకుర్తి : విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించే విధంగా కార్యక్ర మాలు రూపొందించాలని జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జవహర్‌ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్‌ మండలపరిషత్‌ ప్రాధమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ బి.జవహర్‌ మాట్లాడుతూ వార్షి కోత్సవాలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపు తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిం చడం అభినందనీయమన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ గోపురపు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం అభినందనీ యమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ సోమా శేషాద్రి, చేనేత సొసైటీ అధ్యక్షుడు అవ్వారు ఆదినారాయణ,లయన్స్‌క్లబ్‌ డైరెక్టర్‌ చలువాది రమేష్‌, యుటిఎఫ్‌ అధ్యక్షుడు ఎస్‌కె.అక్బర్‌, నాయకులు వీరారెడ్డి, హరిబాబు, ఉపాధ్యాయులు పి.రమేష్‌ కుమార్‌, సుబ్బలక్ష్మి,శైలజ, శివకుమారి, నాగలక్ష్మి, కాసుల యానాదిశెట్టి, డ్యాన్స్‌ మాస్టార్‌ గణేష్‌, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు చాట్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️