వృద్ధులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోండి

Apr 2,2024 22:07

ప్రజాశక్తి-విజయనగరం కోట :  వృద్ధు లు, వికలాంగులు, ఇతర పెన్షన్‌ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు పలువురు టిడిపి నాయకులు ఎంపిడిఒకు మంగళవారం వినతి నిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్‌ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినందున వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అందించడంలో తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు, కనకల మురళీమోహన్‌ పాల్గొన్నారు.

➡️