వెంకటరామిరెడ్డికి నివాళి

ప్రజాశక్తి-వెలిగండ్ల : కంకణంపాడు మాజీ సర్పంచి శ్యామల వెంకటరామిరెడ్డి శనివారం రాత్రి మృతిచెందారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణయాదవ్‌ వెంకటరామిరెడ్డి మృదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నివాళులర్పించిన వారిలో జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి, మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి, వైసిపి నాయకుడు నాగూర్‌యాదవ్‌, కటికల వెంకటరత్నం ఉన్నారు. డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి నివాళి..మాజీ సర్పంచి శ్యామల వెంకటరామిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకుడు దేశిరెడ్డి రత్నాకర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మతి చెందాడు. ఆయన మృతదేహాన్ని డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళుర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నివాళుర్పించిన వారిలో టిడిపి మండల మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, వెలిగండ్ల ఎంపిటిసి చిలకల వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్‌రెడ్డి, కొండు విజయభాస్కర్‌ రెడ్డి, సుబ్రమణ్యం, పోకల పుల్లారెడ్డి, బొప్పరాజు లక్ష్మీనారాయణ, రావూరి వెంకటరెడ్డి తదితరులుఉన్నారు.

➡️