వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్య కళాశాల విద్యార్థుల ప్రతిభ

Feb 10,2024 21:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : స్థానిక తోటపాలెంలోని సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్‌.పల్లవి, సిహెచ్‌ శ్రీలక్ష్మి, ఈనెల 7నుంచి 9 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ లో జరిగిన అంతర్‌ జోనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పతకాలు సాధించారు. పల్లవి 64 కేజీల విభాగంలో స్నాచ్‌ – 80 కేజీలు జర్క్‌ – 100 కేజీలు మొత్తం 180 కేజీలు పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. శ్రీలక్ష్మి 81 కేజీల విభాగంలో స్నాచ్‌ 83 కేజీలు, జర్కు 102 కేజీలు మొత్తం 185 కేజీలు పూర్తి చేసి రజిత పతకం పతకం సాధించింది.ఈ సందర్భంగా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం శశి భూషణ రావు , కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం వి సాయి దేవ మణి, ఎన్‌ సి సి ఆఫీసర్లు కెప్టెన్‌ ఎం సత్య వేణి, ఎం.ఉదరుకిరణ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ . బి. సూరపు నాయుడు, వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ చల్లారాము, అధ్యాపకులు పాల్గొని అభినందనలు తెలిపారు.

➡️