వేసవిలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా : ఎస్‌ఇ

ప్రజాశక్తి – కడప రానున్న వేసవిని దష్టిలో ఉంచుకొని విద్యుత్‌ వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్‌ను అందించే ందుకు అవసరమైన ప్రాంతాలలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి ఎస్‌.రమణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డివిజన్‌ విద్యుత్‌ కార్యాలయంలో కడప, చింతకొమ్మదినెఎ్న పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, మండలాల క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగటిపూట వీధి దీపాలు వెలగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ వధాను, విద్యుత్‌ అరికట్టాలన్నారు. లక్ష్యాలను నిర్ద్ఱశించుకుని పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు విద్యుత్‌ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో కడప ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎల్‌ నరసింహ ప్రసాద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఏఈలు, జూనియర్‌ ఇంజనీర్లు, అకౌంట్స్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️