వైసిపికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా

Apr 1,2024 23:05

విలేకర్లతో మాట్లాడుతున్న జంగా కృష్ణమూర్తి
ప్రజాశక్తి – దాచేపల్లి :
వైసిపి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. తనను నమ్ముకున్న వారికోసం టిడిపిలో చేరుతానని చెప్పారు. మండలంలోని గామాలపాడులో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీలో విధేయంగా పని చేశానని, 2019 ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశానని చెప్పారు. అయితే ప్రస్తుతం గురుజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ‘పార్టీ నాది’ అనే తరహాలో ప్రవర్తిస్తున్నారని, ఆయన తీరుతో తనను నమ్ముకున్న ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా న్యాయం చేయలేకపోయానని చెప్పారు. దీనిపై పార్టీ పెద్దలకు వివరించినా సమాధానం లేకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తన నిర్ణయం బాధాకరమే అయినా తన ప్రాథమిక సభ్యత్వానికి బీసీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

➡️