వైసిపిలో టిడిపి నేతల చేరిక

Feb 13,2024 21:51
ఫొటో : వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఫొటో : వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
వైసిపిలో టిడిపి నేతల చేరిక
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మండల పరిధిలోని తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం గ్రామంలో టిడిపికి చెందిన టైలర్‌ బాబు, హరిబాబు శ్రీనుతోపాటు మరో 50 మంది మత్స్యకార కుటుంబాలు వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎంఎల్‌ఎ వారికి భరోసా కల్పించారు. దాంతో మత్స్యకారులు వైసిపి బలోపేతానికి తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు, ఎఎంసి చైర్మన్‌ సన్నీబోయిన ప్రసాద్‌ యాదవ్‌, జెడ్‌పిటిసి జంపాని రాఘవులు, మహేంద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️