వైసిపి నాయకులు సిద్ధంగా ఉండాలి

Feb 12,2024 21:41
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
వైసిపి నాయకులు సిద్ధంగా ఉండాలి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపును నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రతి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలఆన్నరు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి ప్రజలకు చెబుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర డిఎల్‌డిఎ చైర్మన్‌ గొల్లపల్లి విజయ కుమార్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, మండల కన్వీనర్‌ చర్ల సతీష్‌ రెడ్డి, జొన్నవాడ చైర్మన్‌ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, పట్టణ కన్వీనర్‌ మల్లారెడ్డి, చైర్‌పర్సన్‌ సుప్రజా మురళి, యర్రంరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, అల్లాభక్షు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️