వైసిపి పాలనలో కుంటుపడిన అభివృద్ధి

Apr 1,2024 21:26

ప్రజాశక్తి-బొబ్బిలి : వైసిపి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మున్సిపాలిటీ లోని అప్పయ్యపేట, సింగారపువీధిలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ సమస్యతో యువత బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్దించారు. ప్రచారంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి, టిడిపి పట్టణ అధ్యక్షులు శరత్‌, సీనియర్‌ నాయకులు రౌతు రామమూర్తి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️