వైసిపి పాలనలో ధరల భారం

Feb 12,2024 20:16

ప్రజాశక్తి-విజయనగరం కోట :  వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలపై నిత్యావసర ధరలతో పాటు అనేక భారాలు పడ్డాయని టిడిపి విజయనగరం నియోజకర్గ ఇన్‌ఛార్జి పి.అదితి గజపతి అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్‌ ధర్మపురిలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, పాదయాత్రలో హామీలు ఇచ్చి జగన్‌ మడమ తిప్పారని అన్నారు. ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీ ని గెలిపించి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ వి పి రాజు పట్టణ, అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌ మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, మాజీ కౌన్సిలర్‌ గేదెల ఆదిబాబు, సతీష్‌, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️