శంఖారావం సభను విజయవంతం చేయాలి

Feb 10,2024 21:33

ప్రజాశక్తి- గంట్యాడ : ఈనెల 16వ తేదీన జరగనున్న లోకేష్‌ శంఖారాం సభను విజయవంతం చేయాలని గజపతినగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్‌ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. శనివారం గంట్యాడ కెపిఎన్‌ బిఈడి కళాశాలలో జరిగిన కార్యకర్తల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుడల పనిచేసి ప్రతి గ్రామం నుండి శంఖారావం సభకు జనాన్ని తరలించాలన్నారు. శంఖారాం సభలో రైతులు సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ డిజైన్‌ మార్పు చేయడానికి కృషి చేస్తానని కొండపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణం గురించి, భీమసింగ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ గురించి లోకేష్‌కు తెలియజేస్తామన్నారు. సుజల స్రవంతి ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరును అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు కొండపల్లి భాస్కర నాయుడు, కార్యదర్శి తల్లి చిన్నరామ నాయుడు, అల్లు విజయకుమార్‌, గోపాలరావు, బండారు బాలాజీ, బూడి అప్పలనాయుడు, రేవల్ల సతీష్‌, సీనియర్‌ నాయకులు రొంగలి కృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూరించిన నాధమే శంఖారావం అని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావంతో పర్యటించి జగన్‌ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయ నున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు టిడిపి ‘శంఖారావం’ అనే కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. శంఖారావం ద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు జి.ఎస్‌ నాయుడు, మాజీ ఎంపిపి రెడ్డి వెంకన్న, పాల్గొన్నారు.టిడిపి శంఖారావ సభ స్థలి పరిశీలననెల్లిమర్ల: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈనెల 16న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహించనున్న శంఖారావం సభ వేదికను టిడిపి నాయకులు శనివారం పరిశీలించారు. రామతీర్థం ప్రకృతీ లేఅవుట్‌లో స్థలాన్ని టిడిపి నియోజక వర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, టిడిపి రాష్ట్ర కార్యని ర్వహక కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, ఇచ్ఛాపురం పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, నాయకులు కంది చంద్రశేకర్‌, పతివాడ అప్పలనారాయణ, నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌, కర్రోతు సత్యనారాయణ, పల్లె భాస్కరరావు, నెల్లిమర్ల నగరపంచాయతీ అధ్యక్షులు బైరెడ్డి లీలావతి, పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఆకిరి ప్రసాద రావు, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, నాయకులు కలిదిండి పాణిరాజు, లెంక అప్పలనాయుడు, అట్టాడ శ్రీధర్‌, దంగా భూలోక, అవనాపు సత్యనారయణ, గురాన చక్రధర్‌, పోతల రాజప్పన్న, నల్లం శ్రీనివాసరావు, తాడ్డి సత్యనారాయణ పరిశీలించారు.

➡️