శాస్త్రీయ దృక్పథం పెరగాలి

Feb 28,2024 21:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించు కోవాలని జెవివి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవిఎన్‌ వెంకటరావు, రమణప్రభాత్‌ అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా లక్ష్మీ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బుధవారం జరిగిన సదస్సులో వారు మాట్లాడారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ మూఢ నమ్మకాలు ఉండడం బాధాకరమన్నారు. గ్రామీణల్లో సైన్సు పట్ల అవగాహన కల్పించా లని సూచిం చారు. కార్య క్రమంలో స్కూలు ప్రిన్సిపల్‌ వీరా స్వామి, సామాజిక కార్యకర్త అబ్దుల్‌ రవూఫ్‌ తది తరులు పాల్గొన్నారు. 

➡️