శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించుకోవాలి

Feb 11,2024 00:31

నృత్యం చేస్తున్న కళాకారులు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రజలలో శాస్త్రీయ ధృక్పథం కల్పించటమే కళాజాతా లక్ష్యమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మురళిధర్‌ పేర్కొన్నారు. శనివారం అడవితక్కెళ్లపాడులోని ఎంవిఎస్‌ కోటేశ్వరరావు మెమోరియల్‌ స్కూల్‌కు జెవివి సైన్స్‌ జాతా వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మురళిధర్‌ మాట్లాడుతూ ప్రజల్లో మూఢనమ్మకాలు, పర్యావరణం, మద్యపానం, లింగసమానత్వం, అందరికీ ఆరోగ్యం మొదలైన విషయాల్లో కళారూపాలు, పాటలు, మ్యాజిక్‌ ద్వారా అవగాహన కల్పించటం కోసం శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ కళాజాతా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రసాద్‌ మాట్లాడుతూ జాతకాలు, తాయత్తులు, రంగురాళ్లు ఇలా అనేక రూపాలలో ప్రజల్ని మోసం చేస్తున్నారని, వీటికి దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.జాన్‌బాబు, నాయకులు టి.ఆర్‌.రమేష్‌, చాందిని, ఎస్‌.కె.అహ్మద్‌ హుస్సేన్‌, ఎన్‌.తాండవకృష్ణ, ఎల్‌.ఎస్‌.భారవి, ఇ.అనిల్‌కుమార్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️