శిద్దా వెంకటకృష్ణారావుకు నివాళి

ప్రజాశక్తి-చీమకుర్తి : రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, ఆర్యవైశ్య ప్రముఖుడు శిద్దా వెంకటకృష్ణారావుకు పలువురు నివాళులర్పించారు. శిద్దా వెంకటకృష్ణారావు సంస్మరణ ,వైకుంఠ ఏకాదశి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు శిద్దా వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకట కృష్ణారావు కుమారులు శిద్దా వెంకట ఆంజనేయ వరప్రసాదరావు, శిద్దా కాశీవిశ్వేశ్వరరావు,శిద్దా వెంకటశ్రీనివాసరావు, శిద్దా రామకృష్ణ, కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటకృష్ణారావుకు నివాళులర్పించిన వారిలో శిద్దా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, శిద్దా పాండురంగారావు, శిద్దా నాగేశ్వరరావు, శిద్దా హనుమంతరావు, టిటిడి బోర్డు డైరెక్టర్‌ శిద్దా సుధీర్‌ కుమార్‌, శిద్దా సుధాకర్‌, శిద్దా సురేష్‌, శిద్దా బాలాజీ, శిద్దాపెదబాబు,శిద్దా సాయిబాబు,శిద్దా సూర్యప్రకాశరావు,శిద్దా పవన్‌కుమార్‌, గోల్డెన్‌ గ్రానైట్‌ జనరల్‌ మేనేజర్‌ గిరిబాబు, కృష్ణసాయి గ్రానైట్‌ మేనేజర్‌ కమలాకర్‌, వివిధ పార్టీల నాయకులు కాట్రగడ్డ రమణయ్య, కందిమళ్ళ గంగాధరరావు, రావిపాటి రాంబాబు, సూరంపల్లి హనుమంతరావు, రావిపాటి శ్రీను, గోల్డ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ నాయకులు, గ్రానైట్‌ అసోసియేషన్‌ నాయకులు ఉన్నారు.

➡️