శ్మశాన స్థలం ఆక్రమణ

Feb 10,2024 22:08

శ్మశాన స్థలం ఆక్రమణ
అడ్డుకున్న దళితులు
మృతదేహంతో నిరసన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తరతరాలుగా ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జాచేసి శవాన్ని కూడా పూడ్చనివ్వకుండా అడ్డుకోవడంతో చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని గంగాసాగరం విజయనగరం దళితవాడ దళితులు ఆగ్రహంతో అప్పటికప్పుడే గుంత తవ్వి ఖననం చేయడంతో కబ్జాదారులకు దళితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గంగాసాగరం విజయనగరానికి చెందిన దళితులు తరతరాలుగా సమీపంలోని ఖాళీ స్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకొని అక్కడే చనిపోయిన వారిని పూడ్చేవారు. శ్మశాన వాటిక ఆనుకొని ఉన్న స్థలయజమాని సైమన్‌ శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించుకొని చనిపోయినవారిని ఖననం చేయకుండా అడ్డుకుంటున్నాడు. శనివారం చిన్నయ్య అనే దళిత వద్ధుడు మతి చెందాడు దీంతో గ్రామస్తులు శవాన్ని తీసుకొని స్మశానానికి వెళ్తే ఇక్కడ పూడ్చవద్దంటూ అడ్డుకోవడంతో దళిత యువకులు మహిళలు, ఘర్షణకు దిగి తాము తరతరాలుగా ఇక్కడే ఖననం చేస్తున్నామంటూ గుంత తవ్విపూడ్చారు. రెవెన్యూ అధికారులు పోలీసులు కబ్జాకు గురైన స్థలం స్మశానవాటికే అంటూ నిర్ధారించారు.

➡️