సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలి: కల్పనారెడ్డి

ప్రజాశక్తి-గిద్దలూరు: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన వైసిపి సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ఆ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి సతీమణి కల్పనారెడ్డి అన్నారు. పట్టణంలోని 18వ వార్డులో ఆమె ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలక తీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. నవరత్నాల పథకాలతో ప్రతి ఇంట్లో లబ్ధిచేకూరిందని, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి పేదవాడు సంతోషంగా జీవిం చారని అన్నారు. సంక్షేమ పథకాలు మరోసారి ఇంకా మంచిగా అందాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందా మన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందురు నాగార్జునరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఆర్డి రామకృష్ణ, కాతా దీపిక, కౌన్సిలర్‌ మానం బాలిరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మస్తాన్‌వలి పాల్గొన్నారు.

➡️