‘సంత’ పూర్వ వైభవానికి కృషి: మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక ఎఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల సంత పూర్వవైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున అన్నారు. స్థానిక ఎఎంసి కార్యాలయ అవరణలో ఏర్పాటు చేసిన సంత పునరుద్ధరణను మంత్రి నాగార్జున గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ సంత పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. సంత పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ఎఎంసి సెక్రటరీ పి దానమ్మ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎఎంసి ఎడిఎం కెవిఎన్‌ ఉపేంద్రకుమార్‌, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలాల వైసిపి అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, సొసైటీ చైర్‌ పర్సన్‌ దుంపా యలమందారెడ్డి, నాయకులు నర్రా సురేష్‌ బాబు, డాక్టర్‌ యాదల అశోక్‌ బాబు, పి పరంధామరెడ్డి, కే విజరు కుమార్‌, ఎఎంసి ఛైర్మన్‌ మారెళ్ల బంగారుబాబు, ఎఎంసి సూపర్‌వైజర్‌ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️