సచివాలయ భవనం ప్రారంభం

Feb 10,2024 19:54
సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి
సచివాలయ భవనం ప్రారంభం
ప్రజాశక్తి -పొదలకూరు గ్రామాలను సంపూర్ణంగా అభివద్ధి చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బిరదవోలులో శనివారం నూతన గ్రామ సచివాలయ భవనాన్ని పలు అభివద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపు రేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వ సొంతమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకొచ్చామన్నారు. పొదలకూరు జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ నాయకులు పి. రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, మద్దిరెడ్డి రమణారెడ్డి, ఎం. శేఖర్‌ ,శ్రీనివాసులు రెడ్డి, గంగిరెడ్డి ఉన్నారు.

➡️