సర్టిఫికెట్లు మంజూరు చేయించండి సారూ..!

Feb 12,2024 21:34
ఫొటో : మాట్లాడుతున్న ఎపి రైతుసంఘం మండల కార్యదర్శి పూడిపర్తి జనార్థన్‌

ఫొటో : మాట్లాడుతున్న ఎపి రైతుసంఘం మండల కార్యదర్శి పూడిపర్తి జనార్థన్‌
సర్టిఫికెట్లు మంజూరు చేయించండి సారూ..!
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్‌ మండలంలోని వెల్లంటి గ్రామంలో ఈ మధ్యకాలంలో జరిగిన రీ సర్వేలో రైతులకు అందజేసిన పట్టాలలో తప్పులుగా ఉన్న పేర్లు, సర్వే నెంబర్లు మార్పునకు అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయించాలని ఎపి రైతుసంఘం మండలం కార్యదర్శి పూడిపర్తి జనార్థన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో తమ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో భాగంగా పట్టాల పంపిణీ జరిగి మూడు నెలలైందన్నారు. ఆ పట్టాలకు సంబంధించిన చాలామంది రైతుల పేర్లు, సర్వే నెంబర్‌లు తప్పుగా నమోదయ్యాయని తెలిపారు. ఆ మేరకు పొలాల విస్తీర్ణంలో తప్పిదాలను సవరించేందుకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు సరిగా మంజూరు చేయకపోవడం, రేషన్‌ కార్డులు విషయంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతుందన్నారు. గత మూడు నెలల నుంచి వెల్లంటి గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ)కి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. తహశీల్దారుకు సైతం తమ సమస్యలను తెలియజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించుకున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో బాధిత రైతులు జనపాల వెంకటరమణా రెడ్డి, పల్లవరపు శ్రీనివాసులు, గుడి.రాజయ్య, తేరు.హజరత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️